ఆకృతి టౌన్ షిప్ లో ఘనంగా హోలీ వేడుకలు

ఆకృతి టౌన్ షిప్ లో ఘనంగా హోలీ వేడుకలు


ముద్ర ప్రతినిధి, బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని ఆకృతి టౌన్ షిప్ లో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు మొదలైన వేడుకలు మధ్యాహ్నం 12 గంటల దాకా సాగాయి.  ముఖ్యంగా పిల్లలు పెద్ద సంఖ్యలో చేరుకుని, వాటర్ గన్ లు, వాటర్ బెలూన్లు, పొడుల రంగులు చల్లుకుని సందడి చేశారు. డీజే పెట్టుకుని, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. తర్వాత పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చేరుకుని వేడుకలను మరింతగా రంజింప జేశారు. మొత్తం మీద ఉదయం నుంచి టౌన్ షిప్ వాతావరణం సందడి సందడిగా మారిపోయింది. ఒళ్లంతా రంగులు పూసుకున్న చిన్నారుల కేరింతలతో పండగ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో టౌన్ షిప్ కు చెందిన పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, యుగంధర్ రెడ్డి, రావుల రమేష్, ఆపిల్ సంస్థ నరసారావు, బండారు కిశోర్, చందుపట్ల నరసింహారెడ్డి, సుధాకర్ , టౌన్ షిప్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు