మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

మండలంలో ఘనంగా హోలీ వేడుకలు

ముద్ర, మల్యాల: మల్యాల మండలంలో మంగళవారం హోలీ వేడుకలు ప్రజలు ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ  రంగులు చల్లుకొని, హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయా గ్రామాల్లో తెలవారుజామునే చిన్నారులు కామ దహనం చేసి, ఉత్సహంగా వేడుకలు జరుపున్నారు. మల్యాల మార్కండేయ స్వామి ఆలయంలో ఒక్క రోజు ముందే  శాస్త్రోపేతoగా కాముడి దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సహజ సిద్ధమైన రంగులతో హోలీ వేడుకలు నిర్వహించారు.  ప్రజాప్రతినిధులు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.