హోలీ పండుగ ఐక్యతకు చిహ్నం: జిల్లా ఎస్పీ భాస్కర్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు మకరంద్, లత       

హోలీ పండుగ ఐక్యతకు చిహ్నం: జిల్లా ఎస్పీ భాస్కర్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు మకరంద్, లత       

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  ప్రజలను ఒకే సమూహంగా చేసి భేదాభిప్రాయాలు లేకుండా ఐక్యతకు చిహ్నంగా పండుగలు నిలుస్తున్నాయని జిల్లా ఎస్పీ భాస్కర్, అడిషనల్ కలెక్టర్లు మకరంద్, బి.ఎస్.లత లు అన్నారు. .మంగళవారం  ఎస్పీ క్యాంపు ఆఫిసులో,అడిషనల్ కలెక్టర్ల క్యాంప్ ఆఫిసుల్లో  ,టీ ఎన్జీవో,ట్రెసా, పెన్షనర్స్,టీ సీనియర్ సిటీజన్స్ సంఘాల ప్రతినిధులు హొలీ వేడుకలు నిర్వహించారు.ఆ వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ ,అడిషనల్ కలెక్టర్  లు మాట్లాడుతూ  హొలీ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిభింబమన్నారు.

నేచురల్ కలర్స్ వాడిన టీ ఎన్జీవో,రెవెన్యూ, పెన్షనర్స్,సీనియర్ సిటీజన్స్ సంఘాల ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో టీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు భోగ శశిధర్,ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎం.డి.వకీల్,పెన్షనర్స్,సీనియర్ సిటీజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి.ఆశోక్ కుమార్,టీ ఎన్జీవో కార్యదర్శి నాగేందర్ రెడ్డి,సీనియర్ సిటీజన్స్ కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి,యాకూబ్,  ఎం.డి.ఎక్బాల్,పెన్షనర్స్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, నాయకులు కరుణ,విజయ లక్ష్మీ, నారాయణ,సత్యనారాయణ,వి.ప్రకాష్,విఠల్,గంగరెడ్డి,ఉప్పుగళ్ల మురళిదర్,వేణుగోపాల్ రావు,గంగాధర్,,పబ్బా శివానందం, ,రాజ్ మోహన్,సైఫోద్దీన్ పేన్షనర్స్,సీనియర్ సిటీజన్స్ సంఘాల  ప్రతినిధులు పాల్గొన్నారు.