అంధకారంలో ఆసుపత్రి ప్రాంగణం 

అంధకారంలో ఆసుపత్రి ప్రాంగణం 
  • విద్యుత్ దీపాలు లేక రోగులు ఇక్కట్లు

ముద్ర.వీపనగండ్ల:-మండల కేంద్రమైన వీపనగండ్లలో సామాజిక ఆరోగ్య కేంద్రం(30 పడకల ఆసుపత్రి), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్న ఆస్పత్రి ప్రాంగణంలో రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ఆసుపత్రికి వచ్చే రోగులు చీకట్లోనే ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుందని, ఆస్పత్రి ఆరుబయట విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల విషపు పురుగుల బారిన పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆసుపత్రికి ఇటీవలే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన రాత్రివేళ ఆసుపత్రి ప్రాంగణంలో విద్యుత్ దీపాలను వేయాలనే ఆలోచన ఆసుపత్రికి సిబ్బందికి రావటం లేదని, రాత్రివేళ ఆసుపత్రి ప్రధాన గేట్ నుంచి ఆసుపత్రి వరకు వెళ్లాలంటే చీకట్లోనే వెళ్లాల్సి వస్తుందని రోగులు వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఆసుపత్రి ప్రాంగణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.