ఏసీబీకి పట్టుబడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్

ఏసీబీకి పట్టుబడ్డ ఆసుపత్రి సూపరింటెండెంట్
  • రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన వైనం

ముద్ర ప్రతినిధి, నల్గొండ:నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ వలకు చిక్కారు. డ్రగ్ (మెడిసిన్) సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ రాపోలు వెoకన్న ద్వారా గతకొంతకాలంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి మందులు సరఫరా చేస్తున్నాడు. గతనెలలోనే ఇతడి వద్ద రూ. లక్ష లంచం తీసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చునాయక్ తాజాగా మరింత డబ్బు ఇవ్వాలని లేదంటే ముందే టెండర్ వేస్తానంటూ బెదిరించాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా శుక్రవారం ఉదయం సూపంరిం టెండెంట్ లచ్చునాయక్ రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ పక్కా సమాచారంతో లచ్చు  నాయక్ ను  ట్రాప్ చేసి పట్టుకుంది.