ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన‌ అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది..

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన‌ అసెంబ్లీ హౌస్ కీపింగ్ సిబ్బంది..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-అసెంబ్లీలో పనిచేస్తున్న 154 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. 8 ఏళ్ల క్రితం 6 వేల వేతనంతో ఉద్యోగంలో చేరామని, 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 10 వేల జీతమే వస్తున్నదని తెలిపారు. గతంలో అమరావతి రైతులకు కూలీలకు 2500 కూలీ భృతి వచ్చేదని, ఇప్పుడు దానిని కూడా గత వైసిపి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు.

తమను ఆదుకునేందుకు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఈ విష‌యాన్ని సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత అందరితో సరదాగా ముచ్చటిస్తూ వారితో ఫోటో దిగారు.