తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ ...

ముద్ర,తిరుపతి:- తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు చాలా సమయం పడుతోంది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే కాకుండా సాధారణ భక్తులు కూడా స్వామిని దర్శించుకునేందుకు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని టీటీడీ తెలిపింది.వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండడంతో భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉన్నారు.ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో ‌శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది. ఏప్రిల్ 18న ‌శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనుంది టీటీడీ.