చత్తీస్గడ్ లో భారీ ఎన్ కౌంటర్... 10 మంది మావోయిస్ట్ లు మృతి
చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించారు.. దంతేవాడ జిల్లాలోని ఆడవులులో పోలీసులు కూబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్ట్ లు ఎదురు పడ్డారు.. ఈ నేపథ్యంలో ఇరువైపుల నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి..ఇప్పటి వరకు 10 మంది మరణించారు.. పలువురు నక్సలైట్లకు గాయాలయ్యాయి.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..