కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
  • రాష్ట్ర ముఖ్యమంత్రి సారాజ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం
  • భువనగిరి పార్లమెంటు స్థానం నుండి కిరణ్ కుమార్ రెడ్డి విజయం ఖాయం
  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి ముద్ర:- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తుంగతుర్తి నియోజకవర్గంలో విపక్షాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు మందుల సామెల్ అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మద్దిరాల మండల ఎంపీపీ శ్రీమతి గుడ్ల ఉపేంద్ర వెంకన్న తుంగతుర్తి మండలం గానుగుబండ మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ,గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన ఎం. వెంకన్నలతో పాటు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం గడచిన పది సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని తాను ఎమ్మెల్యేగా గెలిచిన మూడు మాసాల్లోని 150 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పనులు చేశానని అన్నారు.

జీర్ణావస్థలో ఉన్న రోడ్లను కోట్లాది రూపాయలతో పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు .రాష్ట్రంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో మెజారిటీ సాధిస్తుందని అందులో భాగంగా భువనగిరి పార్లమెంటు స్థానం నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిసునాయాసంగా విజయం సాధిస్తారని అన్నారు. రానున్న కొద్దిరోజుల్లో బి ఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బిజెపి పార్టీ అంతగా లేదని అన్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.