పోలింగ్ స్టేషన్ సమీపంలో అనుమానితుల హల్చల్...

పోలింగ్ స్టేషన్ సమీపంలో అనుమానితుల హల్చల్...

ముద్ర,రాయికల్ :-రాయికల్ పట్టణంలోని బాలికల పాఠశాల వద్ద గల పోలింగ్ స్టేషన్లకు వెళ్ళే దారిలో అనుమానితులు హల్చల్ చేశారు.దాదాపు 30 మంది యువతులు బ్యాగ్ మరియు ముఖానికి మాస్కులు ధరించి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పాత్రికేయులకు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా వెనుతిరిగారు. ఇట్టి విషయం పోలీసు శాఖ దృష్టికి తీసుకు వెళ్ళగా వారిని విచారించి బస్సులో పంపించారు.కానీ ఇంత మంది యువతులు ఎందుకు వచ్చారు, దొంగ ఓట్లు వేసేం దుకే వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పోలీస్ శాఖ వారిని అదుపులోకి తీసుకొని తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వెనుకకు పంపడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నట్లు పలు పార్టీల నాయకులు అభిప్రాయ వ్యక్తం చేశారు.