విద్యుత్ షాక్ గురై భార్యాభర్తల మృతి

విద్యుత్ షాక్ గురై భార్యాభర్తల మృతి

వలిగొండ, ముద్ర : వ్యవసాయ పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై భార్యాభర్తలు మరణించిన సంఘటన వలిగొండ మండలం నాగారం గ్రామంలో బుధవారం  చోటుచేసుకుంది. గ్రామస్తులు,  పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నాగారం గ్రామానికి చెందిన బండ అంజయ్య (55), జంగమ్మ (50) లు గ్రామ శివారులోని వ్యవసాయ పొలం వద్ద గడ్డి కోసే మిషన్ తో గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అంజయ్య విద్యుత్ షాక్ కు గురయ్యాడు.  భర్తను రక్షించబోయి భార్య జంగమ్మ కూడా విద్యుత్ షాక్ తో మరణించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలిపారు.

  రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి

నాగారం గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన బండ అంజయ్య జంగమ్మ దంపతులు విద్యుత్ షాక్ తో మరణించడంతో వారి కుటుంబాలను ప్రభుత్వ ఆదుకోవాలని    సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్​ చేశారు.  విద్యుత్ షాక్ తగలడం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రభుత్వం వెంటనే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా 20 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా,వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని  డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారుల అలసత్వం పర్యవేక్షణ లోపించడంతో వ్యవసాయ పొలంలో విద్యుత్ వైరు తెగిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని వెంటనే ప్రభుత్వం సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.