డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలనీ మీ వినతినీ ప్రభుత్వాన్ని పంపిస్తా

డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలనీ మీ వినతినీ ప్రభుత్వాన్ని పంపిస్తా
  •  యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కి వినతి పత్రం అందజేత

 ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జర్నలిస్టులను అవమానపరిచే విధంగా వ్యవహరించిన డిపిఆర్ఓ రమేష్  పై చర్యలు తీసుకుసుకోవాలని, ప్రభుత్వానికి మీ వినతినీ పంపిస్తానని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చెప్పారు. సోమవారం  యూనిన్లకు అతీతంగా జర్నలిస్టులు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో వివరించిన ప్రకారం  ఈనెల 27న శనివారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా డిపిఆర్ఓ వ్యవహరించిన తీరు పలు జర్నలిస్టుల ను మనస్థాపానికి గురి చేసే విధంగా ఆయన వ్యవహారం శైలి ఉందన్నారు.

ప్రముఖ పత్రికలు, చానళ్లు అంటూ డిఎస్పీకి ప్రొసీడింగ్స్ పంపడంతో పాటు చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, చిన్న చానళ్ళు,పెద్ద చానళ్లు అంటూ విలేకరుల మధ్యన విభేదాలకు డిపిఆర్ఓ కారకుడు అయ్యాడని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కొందరు విలేకరులను మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోనికి అనుమతించి, మిగతా జర్నలిస్టులను అనుమతించకుండా పోలీసులతో అడ్డుకొని అవమానపరిచాడనీ, జోన్ 1 నుండి అక్రమంగా జోన్ 2 లో అర్హత లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని, అక్రిడిటేషన్ జారీలో  అవకతవకలకు పాల్పడ్డారని, విలేకరుల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా ప్రవర్తించారని స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి కు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.

 ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, ఐత బోయిన రాంబాబు గౌడ్,  పాల్వాయి జానయ్య, బుక్కా రాంబాబు, నాయిని శ్రీనివాసరావు,గన్నోజు జనార్ధన చారి, పల్లె మనీ బాబు,  నాగరాజు, సురేష్, ఎరుకల సైదులు గౌడ్, కొండ శ్రీనివాసరావు, మామిడి శంకర్, మామిడి శ్రవణ్, దుర్గం బాలు, పడిశిరి వెంకట్, నజీర్, జహీర్, నందిపాటి సైదులు, వాసా చంద్రశేఖర్, గిరీష్, వెంకట్రావు, రాజు, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.