ఎన్ కౌంటర్ లో భారత జవాను మృతి

ఎన్ కౌంటర్ లో భారత జవాను మృతి

KASHMIR: దక్షిణ కాశ్మీర్ లోని కుల్గామ్ వద్ద ఉగ్రవాదులతో సాగుతున్న ఎదురుకాల్పుల్లో భారత్ జవాన్ ఒకరు మృతి చెందారు. పాకిస్ఠాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు శనివారం మధ్యాహ్నం భారత ఆర్మీపై కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్ పీఎఫ్, జమ్ముకాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులను దీటుగా ఎదుర్కొంటున్నారు. శనివారం మధ్యాహ్నం కుల్గామ్‌లో దాక్కున్న ఒక మిలిటెంట్ల గుంపును గుర్తించి కాల్పులు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. “కుల్గాం జిల్లాలోని ఫ్రిసల్ చిన్నిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు మరియు భద్రతా దళాలు వేటలో ఉన్నాయి, ”అని ఒక పోలీసు ప్రతినిధి చెప్పారు.