హ్యాట్రిక్ హీరోలు

హ్యాట్రిక్ హీరోలు

 ఐపీఎల్ టోర్నీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. పోటా పోటీగా జరుగుతున్న మ్యాచులు అభిమానులకు అంతులేని ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్లేయర్లు మరపురాని ఇన్నింగ్స్ ఆడుతూ తమ సత్తా చాటుతున్నారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన ఓ మ్యాచులో అటువంటి అరుదైన రికార్డు ఒకటి నమోదయింది. గుజరాత్ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా రషీద్ ఖాన్ రికార్డు క్రియేట్ చేశాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 18 మంది ప్లేయర్లు హ్యాట్రిక్ సాధించారు. ఈ జాబితాలో రషీద్ ఖాన్ చేరాడు. హ్యాట్రిక్ వికెట్లు సాధించిన 19వ వ్యక్తిగా నిలిచాడు.

 19మంది హ్యాట్రిక్ హీరోలు 

ఇండియాన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 19 మంది మాత్రమే హ్యాట్రిక్ దక్కించుకున్నారు. లక్ష్మీపతి బాలాజీ, అమిత్ మిశ్రా, మకాయా ఎంటిని, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, అజిత్ చండీలా, సునీల్ నారయన్, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, అక్షర్ పటేల్, శామ్యూల్ బద్రీ, ఆండ్రూ టైర్, జయదేవ్ ఉనద్కత్, శామ్ కర్రన్, శ్రేయాస్ గోపాల్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, రషీద్ ఖాన్ హ్యాట్రిక్ సాధించిన జాబితాలో ఉన్నారు.


తొలి హ్యాట్రిక్ హీరో లక్ష్మీపతి బాలాజీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన లక్ష్మీపతి బాలాజీ ఐపీఎల్ టోర్నీలో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. వీఆర్వీసింగ్, ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లాల వికెట్లు తీసుకోవడం ద్వారా మొట్టమొదటి ఐపీఎల్ హ్యాట్రిక్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అదే విధంగా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మొత్తంగా మూడు హ్యాట్రిక్స్ సాధించాడు. మరెరవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.