ఇస్కాన్ వారి కార్తీక దామోదర హరతి
ముద్ర.వనపర్తి :-కర్నూలు ఇస్కాన్ గురువులైన వైష్ణవ కృపా దాస్ వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ బాబు అతిథి గృహంలో కార్తీకదీపం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉమా మహేశ్వర భజన మండలి తమ భజన కీర్తనలతో గురువుగారైన వైష్ణవ కృపాదాస్ కు స్వాగతం పలికారు.
తర్వాత గురువు వైష్ణవ కృపా దాస్ క్రిష్ణ నామ సంకీర్తనను భక్తులతో చేయించి, భగవద్గీత కథాంశం ద్వారా మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవచ్చో ఉదాహరణలతో చక్కగా వివరించి అందరినీ ధన్యుల చేశారు, ఇట్టి కార్యక్రమములో డాక్టర్ రమేష్ బాబు, కుటుంబ సభ్యులు భక్తులతో కార్తీక దామోదర హారతి ఇప్పించి భగవద్గీత, జప మాలలు, భోజన వితరణ చేసి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. ఇందులో నగరంలోని పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, విలేకరులు, వ్యాపార వేత్తలు, భక్తులు పాల్గొని గురువు, మరియు రాధా కృష్ణల కృపకు పాత్రులు అయ్యారు.