ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి - సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య

ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి - సిపిఐ మండల కార్యదర్శి దుర్గయ్య

ముద్ర, తుర్కపల్లి:-తుర్కపల్లి మండల కేంద్రంలోని 213 సర్వే నెంబర్లో కొందరు చేపడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని, పేదలకు చెందల్సిన ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఐ మండల కార్యదర్శి సిలివేరు దుర్గయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని 213 సర్వే నెంబర్ లో అనేక ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఇప్పటికైనా కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు కాపాడాలని తెలిపారు.

తహసీల్దార్ కార్యాలయం ఎదురుగానే మాజీ సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్ది నరేందర్ రెడ్ది, ఆర్. కె హాస్పిటల్ కృష్ణ లు అక్రమ నిర్మాణాలను చేపట్టారని, వాటిని వెంటనే కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్కులు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్న స్థానిక రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు అక్రమర్కులపై చర్యలు తీసుకోని యెడల ఎమ్మర్వో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.