ఆకట్టుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ఆకట్టుకున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ప్రదర్శనలు చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతి పాటశాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. అనంతరం పాటశాలలో వివిధ రంగాలలో రాణించిన విద్యార్థులను ప్రశంస పత్రాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా అధ్యక్షుడు బోయినిపెళ్లి శ్రీధరు రావు, యం ఇ ఓ గాయీత్రి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, ట్రస్మ పట్టణ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పాటశాల డైరెక్టర్ రవీందర్ రెడ్డి, పలు ప్రైవేట్ పాటశాలల కరస్పాండెంట్లు గంగారెడ్డి, మనోహర్ రెడ్డి, శేకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.