తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్న ప్రముఖులు

తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ గ్రామాలలో తమ తమ ఓటు హక్కులను వినియోగించుకున్న ప్రముఖులు

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తన ఓటు హక్కును ఆయన స్వగ్రామం ధర్మారం గ్రామంలో సతీసమేతంగా వినియోగించుకున్నారు.మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తన ఓటు హక్కును తిరుమలగిరి మండల కేంద్రంలో సతీసమేతంగా వినియోగించుకున్నారు.


జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు తన ఓటు హక్కును వారి స్వగ్రామం తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో వినియోగించుకున్నారు.ఏఐసీసీ మెంబర్ రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తన ఓటు హక్కును స్వగ్రామం తుంగతుర్తిలో వినియోగించుకున్నారు.