ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ లో  అసమ్మతి సెగలు

ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ లో  అసమ్మతి సెగలు
  • టికెట్లు ప్రకటించడంతో రాజుకుంటున్న వేడి
  • దేవరకొండలో రవీంద్ర కుమార్ ను మార్చాల్సిందే అంటున్న నరసింహ దేవేందర్
  • కోదాడలో మల్లయ్యను మార్చాల్సిందే అంటున్న శశిధర్ రెడ్డి చందర్రావు
  • నల్లగొండలో అభ్యర్థిని మార్చకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న పిల్లి రామరాజు యాదవ్
  • సాగర్ అభ్యర్థిని మార్చాల్సిందే అంటున్న కడారి అంజయ్య యాదవ్
  • తనను ప్రజలకు దూరం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన
  • నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశం పార్టీకి రాజీనామా
  • సూర్యాపేట తుంగతుర్తిలలో పార్టీకి దూరంగా ఉంటున్న డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఉమ్మడి నల్లగొండ జిల్లా బీ ఆర్ఎస్ లో  అసమ్మతి రాగం ఊపందుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత కేసిఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రస్తుత సిట్టింగ్ లకే మళ్లీ టికెట్లు ఇవ్వడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతల్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి ఏకపక్షంగా టికెట్లు ఇచ్చారంటూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి నరసింహులు  తనను ప్రజల్లో లేకుండా చేయాలని పార్టీ అధిష్టానం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ అభ్యర్థిని మార్చకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్థానిక నాయకులు పేర్కొన్నారు.

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను మార్చాల్సిందేనని పట్టుబడుతున్న నాయకులు

దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను తక్షణ మార్చాలని తమకు టికెట్ కేటాయించాలని అక్కడి నుండి టికెట్ ఆశిస్తున్నా దేవేందర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ ఎంపీపీ జానీలు కోరుతున్నారు గ్రామాల వారీగా నాయకులు కార్యకర్తలు సంతకాలు సేకరిస్తూ త్వరలో అన్ని మండలాలను కలుపుకొని పెద్ద ఎత్తున బహిరంగ సభ ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడానికి సలహాలు చేస్తున్నారు.నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ని మార్చాలని తనకే టికెట్ ఇవ్వాలని ఆర్ కే ఎస్ ఫౌండేషన్ తరపున సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న బీసీ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. నమ్ముకున్నవారే మోసం చేశారని, తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగనని ఇండిపెండెంట్గా నల్లగొండ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను మార్చాలని లేదంటే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు 2014లో టిఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్చార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఎర్నేని బాబు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష లక్ష్మీనారాయణ లతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపీపీలు జడ్పీటీసీలు కొందరు ఎంపీటీసీలు మరికొందరు సర్పంచులు కలిసి ఇటీవల భారీ ఎత్తున సమావేశం నిర్వహించి ప్రస్తుత ఎమ్మెల్యే టికెట్ మార్చకపోతే రాజీనామాలు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ఇన్నాళ్లు పార్టీ నీ నమ్ముకొని ఉన్న పట్టుబడుతున్నారు ఈ మేరకు నియోజకవర్గ సంతకాల సేకరణ జరిపి ముఖ్యమంత్రిని కలవడానికి సిద్ధమవుతున్నారు అయితే ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రబాబును కలవడానికి ఇంటికి రాగా గురువారం ఆయన మల్లయ్య యాదవ్ ని కలవడానికి ఇష్టం లేకపోవడంతో బయటకు రాక నిరీక్షించిన మల్ల యాదవ్ చందర్రావుని కలవకుండానే వెళ్ళిపోయారు

 నాగార్జునసాగర్ ప్రస్తుతం ఉన్న నోముల భరత్ ను మార్చాల్సిందేనని స్థానికులకే టికెట్ ఇవ్వాలని తాను బిజెపి టికెట్ కోసం పోటీలో ఉంటే గతంలో తనను పిలిచిన ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఈసారి కూడా టికెట్ ఇవ్వకుంటే పార్టీలో ఉండేది లేదని స్థానిక నాయకుడైన కడారి అంజయ్య యాదవ్ పేర్కొంటున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు మరికొందరు సర్పంచులతో గుర్రంపోడులో ఇటీవల సమావేశం నిర్వహించి భరత్ కు సహకరించే లేదని తేల్చేశారు

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

నకిరేకల్ టికెట్ ను ప్రస్తుతం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు కేటాయించడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన అభిమానులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో నకరికల్లు లో సమావేశం నిర్వహించారు తాను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా ఇండిపెండెంట్గా పోటీ చేయాలన్న విషయాన్ని నిర్ధారించుకుంటానని పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు వీరేశం వెల్లడిస్తున్నారు.ఇందుకు గాను ఆయన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో టచ్ లో ఉంటూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడానికి పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది

ఆరుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడైన మోత్కుపల్లి నర్సింహులు కనీసం తనను సంప్రదించకుండా కెసిఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తనను ప్రజల్లో లేకుండా చేయాలని దురుద్దేశంతో దూరం పెడుతున్నారని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోరిన కేసీఆర్ స్పందించలేదని అలాంటప్పుడు బీ ఆర్ఎస్ పార్టీలోకి తనను ఎందుకు తీసుకున్నారని నరసింహులు ప్రశ్నిస్తున్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ సూర్యాపేట శాసనసభ్యుడు మంత్రి జగదీష్ రెడ్డి తో ముభావంగా ఉండటంతో పాటు ఇటీవల సూర్యాపేటలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు కూడా హాజరు కాలేదు అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో శాసనసభ్యుడు  డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తో విభేదిస్తున్న తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని కూడా ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తుంగతుర్తించి టికెట్ ఆశించిన గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని ప్రకటించారు.ఈ నేపద్యంలో తిరిగి టికెట్లు సంపాదించిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి నేతలను బుజ్జగించి బతిమిలాడి కలుపుకొని పోతారా లేదంటే వీరు కలుపుకొని పోదాం అన్నా అసమ్మతి నేతలు మెట్టు దిగుతారా, కలిసిపోయి రానున్న ఎన్నికల్లో 12 సీట్లలో టిఆర్ఎస్ విజయం సాధిస్తుందా లేదంటే విభేదించి పార్టీకి నష్టం చేకూర్చి ఇతర పార్టీలను గెలిపిస్తారా అన్నది మరికొంత కాలం వేచి చూస్తే గాని బహిర్గతం కాదు