విద్యా సరస్వతి దేవి విగ్రహ కరపత్రం ఆవిష్కరణ
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో ఈ నెల 14న శ్రీ విద్యా సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణకు హాజరుకావాలని ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అభినవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలుసుకొని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదగా శ్రీ విద్యా సరస్వతి విగ్రహ కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భారత లవకుమార్, యువజన సంఘం అధ్యక్షులు వర్కాల గణేష్ కుమార్, ఉపాధ్యక్షుడు జోగు రవీందర్, సహాయ కార్యదర్శి వేముల నరేష్, కోశాధికారి వల్లల బాలరాజ్, సభ్యులు సుంకి సాయికుమార్ ,గుజ్జ పద్మ ఋషి తదితరులు పాల్గొన్నారు.