వ్యవసాయ మార్కెట్ల కార్మికుల కూలీల పెంపు 

వ్యవసాయ మార్కెట్ల కార్మికుల కూలీల పెంపు 


ముద్ర ప్రతినిధి భువనగిరి : జిల్లాలోని 5 వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన హమాలీలు, దళవాయిలు, చాటావాలాలకు కూలీ రేట్లను పెంచినట్లు జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్ తెలిపారు. శనివారం జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కూలీ రేట్లను పెంచడం జరిగిందన్నారు. హమాలీలకు సంబంధించి 9 రూపాయల నుండి 14 రూపాయల 6 పైసలు, దళవాయిలకు సంబంధించి 3 రూపాయల 60 పైసల నుండి 5 రూపాయల 20 పైసల వరకు, చాటా వాలాలకు 2 రూపాయల 30 పైసల నుండి 3 రూపాయల 71 పైసల వరకు పెంచిన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి సబిత, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు గోపీకృష్ణ, జిల్లా స రఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీల సెక్రటరీలు పాల్గొన్నారు