కోదాడలో సందేశాత్మక లఘు చిత్రం విడుదల

కోదాడలో సందేశాత్మక లఘు చిత్రం విడుదల

కోదాడ, ముద్ర:కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో  యూట్యూబ్ వేదికగా గురువారం లఘు చిత్రాన్ని పలువురు ప్రముఖులు విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శకుడు తిరుప్ ఏర్పుల మాట్లాడుతూ సమాజంలో గంజాయి డ్రగ్స్ మూలాలు అందులో రాజకీయ నాయకుల ప్రమేయం తో యువకులు మత్తు పదార్థాలుకు అలవాటు పడి జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో  45 నిమిషాల ఈ లఘు చిత్రంలో చూపించినట్లు తెలిపారు.సమాజంలో మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా యువత సన్మార్గంలో నడిచే విధంగా చేసే ప్రయత్నంలో భాగంగానే సందేశాత్మకంగా లఘు చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  దర్శకుడు తిరుప్ ఏర్పుల, కోదాడ పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుడిగం నరేష్, దేవరకొండ రమేష్,కుడుముల. పవన్, స్వాతి,సంపేట వెంకట్, మచ్చ ఉపేందర్,దొంగరి.వెంకటేశ్వర్లు, ఏసు పాదం,కుడుముల ప్రశాంత్,ఎం. వెంకటేశ్వర్లు,లక్ష్మీ రఫీ,తదితరులు పాల్గొన్నారు.