విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి 

విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి 
  • జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ముద్ర,పానుగల్:- జిల్లాలో  ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.శనివారం పానుగల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షల నిర్వహణ తీరును, పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు.

పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.మొత్తం ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, ఎంతమంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ వెంకటేష్ ని అడిగి తెలుసుకున్నారు.

78 మంది విద్యార్థులకు గాను ఎవరూ గైర్హాజర్ కాలేదని చీఫ్ సూపరెండెంట్ కలెక్టర్ కు తెలిపారు.అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్   ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం జరుగుతుండడంతో కలెక్టర్ విద్యార్థులతో  కాసేపు ముచ్చటించారు.మధ్యాహ్న భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట తహసిల్దార్ సుభాష్ నాయుడు,ఎంఈఒ లక్ష్మణ్ నాయక్,RI మహేష్,ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.