వినూత్నంగా 'బడి బాట' ప్రచారం...

వినూత్నంగా 'బడి బాట' ప్రచారం...

ముద్ర ప్రతినిధి, నిర్మల్:బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు రాష్ర్ట విద్యాశాఖ చేపట్టిన బడిబాట కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రణాళిక ను విడుదల చేసింది. ఈ ప్రణాళిక మేరకు వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతూ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షిస్తున్నారు కొంత మంది ఉపాధ్యాయులు. నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్ పేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎడ్ల బండిపై ప్రచారాన్ని కొనసాగిస్తూ ఇంటింటికీ వెళుతున్నారు. బడి ఈడు పిల్లలను బడికి పంపేలా చిన్నారుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ఆకట్టుకుంటున్నారు.