అతిధి అద్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం. 

అతిధి అద్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం. 

ముద్ర, లక్షెట్టిపేట:ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేటలో అతిధి అధ్యాపకులుగా దిగువ సబ్జెక్టులు బోధించడానికి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.బుదవారం  ప్రిన్సిపాల్ డా. జైకిషన్ ఓజా ఆహ్వానిస్తున్నమన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇంగ్లీష్ -2,  కామర్స్ -2, జువాలజీ-1, కంప్యుటర్ సైన్స్ -2,  క్రాప్ ప్రొడక్షన్-1, డైరీ సైన్స్- 1, స్తాటిస్టిక్స్ -1  చొప్పున  మొత్తం 10 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇట్టి పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీస అర్హత 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీ.జీ. ఉత్తీర్ణత పొంది ఉండాలి . పిహెచ్.డి , నెట్ సెట్ అర్హతలు, బోధనానుభావం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హత కలిగిన అభ్యర్థులు తేదీ 22 జులై 2023 శనివారం సాయంత్రం 4 :30 లోపు పూర్తి చేసిన దరఖాస్తులను సర్టిఫికెట్లు జతపరిచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అఫీసులో అందజేయాలన్నారు. అర్హులందరికి 24 జూలై 2023 సోమవారం రోజు ఉదయం 10:00 గంటల నుండి ఇంటర్వ్యూలు, డెమో తరగతులు  నిర్వహించబడతాయని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు,