కెసిఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుంది..

కెసిఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుంది..
  • కెసిఆర్ రాజకీయ ఓనమాలు ఇందిరాగాంధీ కాంగ్రెస్ లోనే నేర్చుకున్నారు..
  • సంక్షేమానికి బాటలు వేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ..  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: కెసిఆర్ అహంకారానికి హద్దులు లేకుండా పోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడాతు ఇందిరా గాంధీ జయంతి రోజున ఇందిరా ఇందిరమ్మ రాజ్యమా తోకమట్టానా.. అని కెసిఆర్ విమర్శించడాన్ని ఎమ్మెల్సీ తీవ్రంగా ఖండించారు.. కెసిఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని కెసిఆర్ ది నాలికనా.. ఇంకేమన్నానా.. అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ పాలనలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ.. నిరుపేదలు దళితులు గ్రామానికి దగ్గరగా ఉండేలా ప్రైవేటు భూముల సేకరించి ఇల్ల నిర్మాణం, నిరుపేదలకు భూమిపై హక్కులు, ఆస్తిపై హక్కులు కల్పించాలని భూమి పంపిణీ, భూ సంస్కరణలు చేపట్టి మిగులు భూములను నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనత ఇందిరా గాంధీదని అన్నారు. గరీబి హటావో నినాదం ఇచ్చి నిరుపేదలకు పనికి ఆహార పథకం ప్రవేశపెట్టి ఆత్మస్థైర్యం కల్పించారు.. దేశ సమగ్రత కోసం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి... తన ప్రాణానికి హాని ఉందని తెలిసినా లౌకికవాదానికి కట్టుబడి ఉక్కు మహిళగా ప్రపంచం ఇందిరాగాంధీని కీర్తించిందని అన్నారు.

ఎస్సారెస్పీ ప్రాజెక్టును ఇందిరాగాంధీ చొరవ తీసుకొని పూర్తి చేయించడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సస్యశ్యామలమవుతోందని కెసిఆర్ పదేళ్ల పాలనలో తట్టెడు మట్టి కూడా తీయలేదు..తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు..కెసిఆర్ విచక్షణ కోల్పోయి ఇందిరా గాంధీ పై విమర్శలు చేయడమైన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.. 2003లో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ తన మొదటి సంతకాన్ని ఉచిత విద్యుత్ ఫైల్ పై చేశారని గుర్తు చేశారు.పంటలు తడి ఆరిపోకుండా విద్యుత్ సరఫరా చేసామని పరిశ్రమలకు కూతబెట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తును ప్రవేశపెడితే కెసిఆర్ కేవలం వారసత్వంగా మాత్రమే కొనసాగిస్తున్నారని అన్నారు. కెసిఆర్ ను నేను రాజకీయంగా విభేదిస్తా కానీ వ్యక్తిగతంగా నూరేళ్లు బతకాలని కోరుకుంటాను.. డాక్టర్ సంజయ్ కుమార్ విచక్షణ కోల్పోయి ఇంకెన్నాళ్లు బతుకుతావు అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ వాళ్లే మార్ఫింగ్ చేశారంటూ రివర్స్ గేర్ లో వస్తున్నారన్నారు. మీరు మాట్లాడిన వీడియోలను ప్రజల ముందు పెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సూచించారు. రేవంత్ రెడ్డి ఎకరానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుంది అన్నారని ఆ వ్యాఖ్యలను వక్రీకరించారని వారి పై కేసులు పెట్టాలన్నారు.ఇందిరా గాంధీ జయంతి రోజున ఇందిరాగాంధీని కెసిఆర్ విమర్శించడం తనని క్షోభకు గురి చేసిందని కేసీఆర్ మాటల్లో దొర కనబడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు