పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ..

పాత పద్ధతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ..

ముద్ర,తెలంగాణ:-పాత పద్దతిలోనే డ్రైవింగ్‌ లైనెస్సులు యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ కానున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆ మేరకు జూన్‌ 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రాలేదు.దీంతో పాత విధానంలోనే డ్రైవింగ్‌ లైసెన్స్‌లు జారీ చేయనున్నట్లు ఆర్టీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం తొలుత లెర్నర్‌ లైసెన్స్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకుని రాత పరీక్షలకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత నిర్ణీత గడువులోగా లైసెన్స్‌ కోసం డ్రైవింగ్‌ టెస్టులో పాల్గొని అర్హత సాధిస్తేనే పూర్తి లైసెన్స్‌ అందించనున్నారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సినఅ వసరం లేదు. ఆయా డ్రైవింగ్‌ స్కూళ్లు ఆర్టీఏ వద్ద రిజిస్ట్రిషేన్‌చేసుకుని లైసెన్స్‌లు తీసుకోవాలి. ఆయా స్కూల్లలో తొలుత దరఖాస్తు చేసుకుని టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తే ఆ పత్రంతో ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు జారీ కాలేదని, ఈ నేపథ్యంలో పాత పద్దతిలోనే డ్రైవింగ్‌ లెసెన్స్‌లను జారీ చేయనున్నట్లు ఆర్టీఏ శాఖ చెబుతోంది. జూన్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం దురుసుగా బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా, మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.25వేల జరిమానాతోపాటు వాహన యజమాని డ్రైవింగ్‌ రిజి స్ట్రేషన్‌ కార్డును కూడా రద్దు చేస్తారు.