నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు

నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టు రట్టు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు
  • నలుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు నిందితులు
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా పోలీసులు జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల తయారి చేసి విక్రయిస్తున్న ముఠా రట్టు చేశారు. ఈ ఘటనలో నలుగురు నిందితుల అరెస్ట్ చేసి రిమాండుకు పంపినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పొలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పి వివరాలు వెల్లడించారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన కొడిదల మహేష్ తొమ్మిదవ తరగతి వరకే చదివాడు, గల్ఫ్ వెళ్లేందుకు పాస్ పోర్టు కోసం 10 తరగతి సర్టిఫికెట్ అవసరం ఉండగా అదే గ్రామానికి చెందిన కొక్కరకని చంద్రయ్య అలియాస్ చందు దగ్గరి బందువు అయిన బత్తినోజు రజిత నకిలీ సర్టిఫికెట్ లు ఇపిస్తుందని తెలుసుకకొన్నాడు.

చద్రయ్యతో రజితకు ఫోన్ చేయగా నకిలీ సర్టిఫికెట్ రూ. 30 వేలు ఇవ్వాలని అడుగగా 28 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రయ్య మహేష్ ఆధార్ కార్డు, పూర్తి వివివరాలు రజితకు పంపి , 28 వేలు ఫోన్ పే చేసాడు. 27 రోజుల తరువాత రజిత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ పేరుతో నకిలీ ఓపెన్ ఎస్ ఎస్ సి సర్టిఫికేట్ ఇంచింది. మహేష్ పాస్ పోర్ట్ ఈ.సి.ఎన్.ఆర్ కు అప్లై చేయగా, ఎస్ బి హెడ్ కానిస్టేబుల్ ఆర్ . నర్సింగ రావు ఎంక్వయిరీలో నకిలీ అట్టి సర్టిఫికేట్ అని తేలింది. జిల్లా ఎస్పి సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు దర్మపురి పోలీస్ లు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీంతో పలు విషయాలు వేలుగులోకి వచ్చాయి.

కామెర అలియాస్ బత్తినోజు రజిత, బత్తినోజు శ్రావణ్ కుమార్ లు బార్య భర్తలు వీరిద్దరూ ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చే డబ్బులు సరిపోక సులభoగా తక్కువ కాలం లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అనుకుంటున్న సమయంలో 2020లో జస్ట్ డయల్ లో రబీ రాయ్ అనే వ్యక్తి రజితకు పరిచయం అయ్యాడు. రబీ రాయ్ రజితకు ఫోన్ చేసి మీరు డిగ్రీ చేయకున్న డిగ్రీ సర్టిఫికేట్ మీరు అనుకున్న యూనివర్సిటీ నుండి నకిలీ సర్టిఫికేట్ తయారుచేసి ఇస్తానని రూ. 30 వేలు ఖర్చు అవుతాయని ఏవరైన వ్యక్తులు సర్టిఫికేట్ అవసరం ఉంటె చెప్పమని చెప్పాడు. సర్టిఫికేట్ ను బట్టి రూ. 30 వేల నుంచి లక్ష 30 వేలు తీసుకొని డి టి డి సి కొరియర్ లో వారు చెప్పిన అడ్రస్ కి నకిలీ సర్టిఫికేట్ తయారు చేసి పంపేవాడు. వచ్చిన డబ్బులలో వీరు సంగం ఉంచుకొని మిగతా సగం డబ్బులు రబీ రాయ్ తల్లి లక్ష్మీ రాయ్ అకౌంటు కి పంపేవారు.

అలా మూడు సంవత్సరాలలో సుమారు 100 మందికి పైగా నకిలీ సర్టిఫికేట్ లు ఇప్పించినట్లు ఎస్పి తెలిపారు. నిందితులను జైన, కరీంనగర్ లోని రాంనగర్ లలో వారి ఇంటి వద్ద ధర్మపురి సిఐ రాం నరసింహా రెడ్డి, ఎస్ ఐ పి. ఉదయ్ కుమార్, నిందితులను పట్టుకొని నిందుతుల వద్ద నుండి 395నకిలీ సర్టిఫికేట్ లు, ఐదు సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్, లాప్ టాప్, సి పి యు , రూ. 25 వేల నగదు స్వాదినం చేసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికేట్ లు ఎక్కడెక్కడ వాడారు, ఎంతమందికి ఇచ్చారు అనేది దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపు రూ. 15.41 లక్షలు రబీ రాయ్ కి రజిత ఫోన్ పే చేసినట్లు తెలిపారు. నలుగురు నిందితుల అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.