జగిత్యాలలో త్వరలోనే జైత్రయాత్ర 

జగిత్యాలలో త్వరలోనే జైత్రయాత్ర 
  • కాంగ్రెస్ కుర్చిలాటకు మనం బలి కావద్దు 
  • జీవన్ రెడ్డి, రాహుల్ గాంధీలకు కవిత సవాల్ ..
  • తెలంగాణ కంటే దేశంలో ఎ రాష్ట్రంలో అయిన ఒక్క ఉద్యగం ఎక్కువ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట: ఎమ్మెల్సీ కవిత 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జీవన్ రెడ్డి, రాహుల్ గాంధీ లకు తాను జగిత్యాల నుండి ఛాలెంజ్ చేస్తున్నానని దేశంలో తెలంగాణ కంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటి ఎక్కువ ఇచ్చినట్లు నిరూపించిన తాను మళ్లీ రాజకీయాల్లో ఉండనని ఎమ్మెల్సీ కవిత  సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బిఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు మద్దతుగా ఎమ్మెల్సీ ఎల్. రమణ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జీవన్ రెడ్డికి బాగా రాజకీయ అనుభవం ఉందని అందుకే చాలా అబద్దాలు ఆడతారు అని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కొత్తవాడని ఆయనకేం తెలవదని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు అని అన్నారు. జీవన్ రెడ్డి ఉద్యోగాలపై తప్పుడు విషయాలు మాట్లాడుతున్నారని 2.30 లక్షల ఖాళిలకు లక్ష 60 వేల  ఖాళీలు భర్తీ చేశామని, అలాగే హైదరాబాదులో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చామని అందులో 30 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. 

తెలంగాణ కంటే దేశంలో ఎ రాష్ట్రంలో అయిన ఒక్క ఉద్యగం ఎక్కువ ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట నేను చెప్పింది వాస్తవమైతే రాహుల్ గాంధీ రాజకీయాలు మానేయాలన్నారు. కర్ణాటకలో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో రెండు లక్షల అరవై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వంద రోజులలో నింపుతామని రాహుల్ గాంధీ కూడా అబద్ధం చెప్పారన్నారు. ఇంతవరకు ప్రక్రియ కూడా ప్రారంభించలేదన్నారు.

వాళ్ళు ఇచ్చే దొంగ బాండ్ పేపర్లకు ప్రజలు మోసపోవద్దని అన్నారు. కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షుడు రేటెంత రెడ్డి ఉన్నాడని.. కొత్త కొత్త మాటలు కొత్త కొత్త విషయాలు చెబుతున్నారని కల్ప వృక్షం లాంటి కెసిఆర్ కావాలో తులసి వనంలో గంజాయి మొక్క లాంటి రేవంత్ రెడ్డి కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ లో ఎవరు ముఖ్యమంత్రి అయినా వారిలో వారు ఒకరినొకరు గుంజేసుకుంటారని వాళ్ళ కుర్చీలాటకు మనం బలి కావొద్దు అన్నారు. డా. సంజయ్ కుమార్ కు గతంలో కంటే మెజారిటి పెరగాలి ,50 ఇండస్ట్రీలో ఉన్న నాయకుడు ఏమి చేయలేదు కానీ ఈ రోజు బాండ్ పేపర్ రాసి దేవుడి ముందు సంతకం పెట్టారు జీవన్ రెడ్డి, నిజంగా పనులు చేసి ఉంటె ఈ బాండ్ పేపర్ అక్కరలేదని అన్నారు.