నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు

నేటి నుంచి జాన్ పహాడ్ దర్గా ఉర్సు
  • మూడు రోజుల పాటు జరగనున్న ఉర్సు ఉత్సవాలు.


పాలకీడు,ముద్ర:- హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతీక అయిన మండలంలోని జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 25,26,27, తేదీలలో మూడు రోజుల పాటు జరగనుంది.అందు కోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరిచారు. ఉర్శుకు వచ్చే భక్తు లకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉర్శు లో బాగంగా రసూల్ షరీఫ్, నిర్వహిస్తారు,దర్గా లోని సైదులు బాబా, సమాధులను గంధంతో నూతన వస్త్రాలతో (దట్టిలు) పూలదండలతో అలంకరిస్తారు దర్గాలోని కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి బాబాకు నైవేద్యం సమర్పిస్తారు.

24 తేదీన హైదరాబాద్ లోని వక్ఫ్ బోర్డు కార్యాలయం నుంచి పవిత్రమైన గంధాన్ని జానపాడు లోని సందలఖాన్ తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గ్రంధాన్ని గుర్రంపై ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీ. ఉదయం 9.30 గంటలకు సందల్ ఖాన్ నుండి గుర్రం పై జాన్ పహాడ్ పురవీధులలో ఊరేగి,నమాజ్ చేసే సమయానికి దర్గాకు తీసుకువస్తారు.నమాజ్ పూర్తి అయిన అనంతరం గంధాన్ని బాబా బాబా సమాధుల పైకి ఎక్కిస్తారు. అనంతరం దర్గా కు వచ్చిన భక్తులకు గంధాన్ని పంచుతారు. ఈ పవిత్ర గ్రంధాన్ని తాకడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.చివరి రోజున బాబా సమాధుల వద్ద దీపాలు వెలిగించి చివరగా నైవేద్యం(పాతేహ)సమర్పిస్తారు. దీంతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి.. ఈ ఉత్సవానికి నాయకులు,అధికారులు భారీగా పాల్గొంటారు..