జనగామ సభ సాగిందిలా...

జనగామ సభ సాగిందిలా...

జనగామ టౌన్‌, ముద్ర : పోరాటాల పురిటి గడ్డ జనగామలో నిర్వహించిన బీఆర్‌‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ప్రశాంతంగా ముగిసింది. సీఎం కేసీఆర్‌‌ ఈ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరై జనగామ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉదయం 11 గంటల నుంచి జనగామ జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి జనం రావడం మొదలు పెట్టారు. 

11:30 డప్పు సప్పుడుతో కళాకారులు సభ వేదికకు చేరిక
12:00 మహిళల బోనాల ప్రదర్శన.
12:30 జనగామ జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల, గ్రామాల ప్రజలు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. 
1:00 నుంచి 3:45 వరకు ఏపూరి సోమన్నతో పాటు తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఆట, పాట కార్యక్రమం.
3:50 గంటకు సీఎం హెలికాఫ్టర్ సభ ప్రాంగణంపై చక్కర్లు.
3:57 గంటలకు సభ వేదికపైకి సీఎం రాక.
4:21 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం.
4:49 గంటలకు సీఎం ప్రసంగం ముగింపు.
4:57 గంటలకు హలికాప్టర్‌‌లో సీఎం భువనగిరి సభకు బయలుదేరారు.