జయశంకర్ పాత్ర "మరువలేనిది"

జయశంకర్ పాత్ర "మరువలేనిది"

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదని క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ,వైస్ చైర్మన్ విద్యా సాగర్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గుర్తు చేశారు. అలాగే పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహానికి బిఆర్ఎస్ యువ నాయకులు ఎర్రబెల్లి రాజేష్,వార్డు కౌన్సిలర్లు,కార్యకర్తలు హాజరై పూలమాలలు వేశారు. ఈ సందర్బంగా రాజేష్ మాట్లాడుతూ  ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు,కమిషనర్ వెంకటనారాయణ,మేనేజర్ నాగరాజు,అర్.పిలు తదితరులు పాల్గొన్నారు.

  • లీడర్ల మధ్య మాట మాట..

పట్టణంలోని జయశంకర్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కొందరు లీడర్లు ఆలస్యంగా హాజరయ్యారు. కార్యక్రమం ముగిసే సమయానికి చేరుకున్న లీడర్లు వైస్ చైర్మన్ పై కోపద్రిక్తులయ్యారు. సమాచారం అందించి చేరుకొకముందే ఎలా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా కొంత సమయం లీడర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది.ఇదంతా చైర్ పర్సన్ ముందే జరిగింది.