బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు...

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు...

కోదాడ, ముద్ర:కోదాడ మండలం రెడ్లకుంట, గుడిబండ గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీకి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన మూడు కుటుంబాలకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీలోకి  చేరారు. కోదాడ పట్టణంలోని గునగుంట్ల ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో టిపిసిసి మాజీ అధ్యక్షులు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సమచిత స్థానం కల్పిస్తామని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారు అమరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, మెండే చిన్న శ్రీనివాస్ యాదవ్, అమరబోయిన రాముడు యాదవ్, ఉన్నారు. అనంతరం గుడిబండ గ్రామానికి చెందిన బిజెపి పార్టీకి చెందిన ఎరగని నాగ శేషు గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గంగవరపు లక్ష్మణరావు, రేవూరి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.