ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్ పదవి విరమణ
ముద్ర ప్రతినిధి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్ పదవి విరమణ చేశారు. బుధవారం నల్గొండ దేవాదాయ శాఖ కార్యాలయంలో పదవి విరమణ సమావేశ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణం శ్రీ వెంకటేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల చార్యులు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవాలయాలకు అర్చకులకు సిబ్బందికి ఆయన ఎంతో సేవలు అందించారని చెప్పారు. అనంతరం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్ చార్యులు, సంకర్షణ ఆచార్యులు శరత్ చంద్ర, శ్రీనివాసరెడ్డి ఉమ్మడి జిల్లాలలోని పలు దేవాలయాల అర్చకులు సిబ్బంది తదితరులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.