మంత్రి ఇంద్రకరణ్ పై పోటీకి జర్నలిస్టులు సిద్ధం

మంత్రి ఇంద్రకరణ్ పై పోటీకి జర్నలిస్టులు సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై పోటీకి జర్నలిస్టులు రంగం సిద్ధం చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ పాత్రికేయులు ఎన్నో పర్యాయాలు మంత్రిని కలిసినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి సారి ఏదో ఒక రకంగా తాత్సారం చేసినందుకు నిరసనగా జర్నలిస్టులు ఈ నిర్ణయానికి వచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని మోసం చేసినందుకు నిరసనగా ఈ చర్యకు దిగినట్లు వివరించారు.