ఆత్మీయ అధికారికి అపూర్వ సన్మానం

ఆత్మీయ అధికారికి అపూర్వ సన్మానం

సూర్యాపేట డిఎస్పి గొల్లూరి రవి కుమార్ ను ఘనంగా సన్మానించిన  జర్నలిస్టులు

సూర్యాపేట: ఇటీవల సూర్యాపేట సబ్ డివిజనల్ అధికారిగా (డిఎస్పి) ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన  గొల్లూరి రవికుమార్ ను రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ బంటు  కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం సూర్యాపేట జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. బొకేలు, పూల దండలు, శాలువాలతో కన్నుల పండువగా సన్మాన కార్యక్రమం కొనసాగింది. సూర్యాపేట ప్రాంతంలోనే గత కొన్ని సంవత్సరాలుగా సబ్ ఇన్స్పెక్టర్ గా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, డిఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన డి.ఎస్.పి రవికుమార్ కు సూర్యాపేట జర్నలిస్టులు అందరూ సుపరిచితమే. సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను సత్వరం సాల్వ్ చేయడంలో మేటి అని డిఎస్పి రవికుమార్ కు మంచి పేరు ఉంది.  

ఎవరికైనా ఆపద వస్తే తక్షణం స్పందిస్తూ ఆదుకునేతత్వం డి.ఎస్.పి రవికుమార్ ది. నిస్సహాయులు, నిర్భాగ్యుల పట్ల మానవత్వంతో వ్యవహరిస్తూ, అరాచక శక్తులు, అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించే నికార్సైన పోలీస్ అధికారి గా  పేరుపొందిన డి ఎస్ పి రవికుమార్ సూర్యాపేట డిఎస్పీగా రావడం పట్ల జర్నలిస్టులందరూ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు అందజేసి అభినందనలు తెలిపారు. సూర్యాపేట డిఎస్పి రవికుమార్ సన్మానించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ, నవిలే భద్రయ్య, ఉయ్యాల నరసయ్య, రాజశేఖర్, కొండ్లె కృష్ణయ్య, అజయ్ కుమార్, మామిడి శంకర్, సైదులు గౌడ్, యెగ్గే శంకర్, బాచి, జహీర్, పాష, పడిసిరి వెంకట్, సతీష్, లింగారెడ్డి, రమేష్ నాయుడు, మామిడి శ్రావణ్, దుర్గం బాలు, వేల్పుల ప్రవీణ్, హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు దైద వెంకన్న, కల్కూరి విజయ్ తదితరులున్నారు.