భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం..

భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.. సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్‌ తదితరులు పాల్గొన్నారు.