అభ్యుదయ వాది,గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి రావు పూలే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అభ్యుదయ వాది,గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి రావు పూలే - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు 

ముద్ర/షాద్ నగర్:- అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మ జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజ నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, బహుజన తత్వవేత్త సామాజిక దర్శనికుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని కొనియాడారు. అంటరానితనం నిర్మూలనతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎనలేని పోరాటాలు చేసిన మహా వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని పేర్కొన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తుల్లో మహాత్మ జ్యోతిరావు పూలే ఒకరని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తుందని వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చామని, మున్ముందు మరిన్ని పథకాలను తీసుకురారన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందేమోహన్, కాంగ్రెస్ నాయకులు బస్సు, క్యూసెట్ శీను, నందిగామ శంకర్, శేఖర్, అశోక్ లు పాల్గొన్నారు.

ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో..

ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక వేత్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా మహాత్మా ఫూలే జయంతి సందర్భంగా షాద్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న మహాత్మ జ్యోతి రావు పులే విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతి రావు పూలే గొప్ప సామాజిక వేత్త, సంఘ సంస్కర్త అని స్త్రీ విద్య కోసం అనేక పోరాటాలు చేశారు,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ సైతం ఫూలే జీవితం, కృషి, బోధనలతో స్ఫూర్తి పొందారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సంస్కర్త, కవి, రచయిత, విమర్శకుడు మహాత్మా ఫూలే ఆలోచనలను, ఆచరిస్తూ, ఆయన ఆశయాలను సాధించడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు ఎం.రాంబల్ నాయక్,  బిసి సంక్షేమ సంఘం దక్షణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మద్దూరి అశోక్ గౌడ్, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్, పినపాక ప్రభాకర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నర్సింలు, బీఎస్పీ నాయకులు ప్రశాంత్, టిఎల్ఎఫ్ నాయకులు కరుణాకర్, టీవీవీ నాయకులు శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు నర్సింలు,  దళిత సంఘాల నేతలు టెలిఫోన్ వెంకటయ్య, జనార్ధన్, బీసీ సంఘం నాయకులు రాములు గౌడ్, రాజు గౌడ్, దళిత విద్యార్థి నాయకులు జాంగారి రవి, మాల మహానాడు నాయకులు మల్లేష్, బీసీ నాయకులు రాజేందర్, తిరుమలయ్యలు పాల్గొన్నారు.