గరీబోళ్లంటే పట్టింపులేని సీఎం కెసిఆర్

గరీబోళ్లంటే పట్టింపులేని సీఎం కెసిఆర్
  • బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మినారాయణ ధ్వజం

ముద్ర ప్రతినిధి,మెదక్:-గరీబోళ్లంటే సీఎం కెసిఆర్ కు పట్టింపు లేదని బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ముందు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు రెండు పడకగదుల ఇళ్ళను పంపిణీ చేయాలని డిమాండ్ చ మెదక్  బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా  నిర్వహించారు. 

ఈ సందర్భంగా యెండెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మేనిఫెస్టోలో అర్హులైన వారికి ఇల్లు ఇస్తానని వాగ్దానం చేసి దానిని తుంగలో తొక్కారన్నారు.కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల  ఇండ్లను మంజూరు చేస్తే అందులో 30 వేల ఇళ్లకు మించి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదన్నారు.రాష్ట్రంలో డబల్ బెడ్ రూమ్ కావాలని 30 లక్షల మంది ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకుంటే అందులో 26 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించి అందులో 30 వేలు మాత్రమే ఇచ్చిందని మిగతా వారికి ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల ఇండ్లను కేంద్రం మంజూరుచేస్తే అందులో సగం పూర్తయి సగం నిర్మాణంలో ఉన్నాయన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ కావాలని దరఖాస్తు చేసిన పత్రాలు కేంద్రం ఇవ్వమని ఉత్తరాలు రాస్తే ఈ ముఖ్యమంత్రికి పట్టింపు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కరణం ప్రణీతసోమశేఖర్, నందు జనార్ధన్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, నాయకులు వాల్దాస్ మల్లేశం గౌడ్, బైండ్ల సత్యనారాయణ, రాఘవరెడ్డి, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.