పానుగల్ లో ఘనంగా కేసీఆర్ జన్మ దిన వేడుకలు

పానుగల్ లో ఘనంగా కేసీఆర్ జన్మ దిన వేడుకలు
  • ఆసుపత్రి,కస్తూర్బా పాఠశాల లో పండ్లు పంపిణీ
  • కేక్ కట్ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలను శనివారం పానగల్ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్లు,పండ్లను పంపిణీ చేశారు.అలాగే కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థినిలకు పండ్లను పంపించేశారు.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్,జిల్లా ఎంపీటీసీల ఫోరం సుబ్బయ్య యాదవ్,ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు గంధం లక్ష్మయ్య ,మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తిరుపతయ్య నాయుడు,మాజీ రైతు బంధు మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,మండల కో ఆప్షన్ సభ్యులు అలీమ్, సింగిల్ విండో డైరెక్టర్ ప్యాట బాలరాజు, మాజీ సర్పంచులు సింగిరెడ్డి గోపాల్ రెడ్డి,చంద్రు నాయక్,నాగేశ్వర్ నాయుడు,చిక్కేపల్లి నర సింహ,బాల స్వామి,మేస్త్రి రాములు,తిరుపతి యాదవ్,నాయకులు రాంచందర్ రావు, ధర్మా రెడ్డి, భాస్కర్ రెడ్డి,పాపయ్య,కురుమూర్తి,నిరంజన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గోప్లాపూర్ అంజనేయులు,ఆది హనుమంతు, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.