బొగ్గు బావులపై కేసీఆర్ జన్మదిన వేడుకలు

బొగ్గు బావులపై కేసీఆర్ జన్మదిన వేడుకలు
KCR birthday celebrations on coal wells

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల (మందమర్రి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన  వేడుకలు సింగరేణి గనులపై ఘనంగా జరిగాయి. టీబీజీకేఎస్, టిఆర్ఎస్ శ్రేణులు జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజనల్ లలోని  అన్ని గనులపై ముఖ్యమంత్రి పుట్టినరోజు సంబరాలు జరిగాయి. గనులపై ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నేతలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం వలన తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు తో జీవించి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. కేసీఆర్ నాయకత్వంలో దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దేశవ్యాప్తంగా నూతన వరుడికి శ్రీకారం చుట్టాలని అన్నారు.