భారత్ కు బలమైన రాజకీయ శక్తి : కేసీఆర్

భారత్ కు బలమైన రాజకీయ శక్తి : కేసీఆర్
KCR-is-a-strong-political-force-for-Barat

ఆయనకు ప్రశ్నించడం తెలుసు.. పరిష్కార మార్గాలు తెలుసు అందుకే తెలంగాణ ఉద్యమాన్ని ఎంత అణచివేయాలని చూసినా.. కేసీఆర్ వ్యూహాల ముందు పని చేయలేకపోయాయి. కేసీఆర్ కేవలం రాజకీయ శక్తి మాత్రమే కాదు. ఆయన  రాజకీయ నేత కంటే.. ముందు ఆయన ప్రశ్నించడంలో నిబద్ధత ఉంటుంది. కేసీఆర్ ప్రశ్నిస్తున్నారంటే ఖచ్చితంగా వాటికి ఆచరణాత్మక పరిష్కార మార్గాలుంటాయనడానికి అనేక సాక్ష్యాలను గమనించవచ్చు. కేసీఆర్ ఉద్యమ నాయకునిగా తెలంగాణ రాష్ట్ర సాధించడంలో బలమైన రాజకీయ శక్తిగా నిలబడ్డారు. కేసీఆర్ కంటే ముందు అనేక మంది తెలంగాణ ఉద్యమాన్ని నడిపినా చివరికి పదవులకో.. ప్రలోభాలకో లొంగిపోయారు. కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా తెలంగాణ కోసం ఎప్పుడు పడితే అప్పుడు రాజీనామా చేస్తూ.. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో విస్తృతం చేశారు.  ఆ సమయంలో కేసీఆర్ లేవనెత్తిన అనేక ప్రశ్నలకు నాడు సమాధానాలు దొరకని పరిస్థితి. అటువంటిది ప్రస్తుతం తెలంగాణ లో  వాటన్నంటికీ పరిష్కారం లభించింది. తెలంగాణ కు జరిగిన అనేక అన్యాయాలను నేడు స్వరాష్ట్రంలో సాకారం అవుతున్నాయి. ఆనాడు కేసీఆర్ ప్రశ్నించినా ప్రతీది నేడు ఉద్యమ నాయకుని ఆద్వర్యంలో సాక్ష్యాలుగా మనముందు కనిపిస్తున్నాయి. 


కేంద్ర బీజేపీ సర్కారు కేవలం రాజకీయ అజెండాతో దేశంలో కుట్రలకు, అవినీతికి పాల్పడుతుంది. ఫలితంగా కార్పోరేట్ శక్తులకు పెద్దపీఠ వేయడంతో సంపన్నులు మరింత ఎదిగారు అది ఇటీవల లెక్కలు చెబుతున్నాయి.  పేదలను దోచి పెద్దలకు దోచిపెట్టే విధానాన్ని కేసీఆర్ ఎండగడుతూ వస్తున్నారు. అటువంటి దేశ వ్యాప్త గుణాత్మక పాలన కోసం కేసీఆర్ తీసుకునే ప్రతీ నిర్ణయంలో స్పష్టమైన విధానాలుంటాయి. వాస్తవానికి భారతదేశంలో బీజేపీ నరేంద్ర మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్కరణల పేరుతో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తూనే ఉంది. బీసీల గణన చేపట్టాలనే డిమాండ్ ఉన్నప్పటికీ దానికి సిద్దం అవడం లేదు. అలాగే గత 25 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం జరుగుతున్న దాని కోసం కేంద్రం పూర్తిగా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుంది. 


గతంలో రైతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని వహించిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేసే చట్టాలను తెచ్చింది. దీంతో స్వయంగా సీఎం స్థాయిలో ఉండి కేసీఆర్ ధర్నా చేస్తే స్వయంగా ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటించారు. ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కేసీఆర్ అనేక జాతీయ స్థాయికి సంబంధించిన సమస్యల పట్ల ఆయన ప్రశ్నించడంతో కేంద్రం దిగిరాక తప్పడం లేదు. ఇటీవల హిందీని బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం చేసింది. 


ఇటీవల కేసీఆర్ దేశంలోని కోట్ల మంది యువతను దృష్టిలో ఉంచుకొని .. స్టాఫ్ సెలక్షన్ లాంటి పరీక్షలను సైతం .. మాతృ భాషల్లో నిర్వహించాలనే డిమాండ్ చేయడంతో.. కేంద్రం దిగి వచ్చి స్టాఫ్ సెలక్షన్ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంటూ స్పష్టమైన నిర్ణయం వెల్లడించింది. బలమైన ప్రశ్నించే నాయకుడు .. పరిష్కార మార్గాలు చూపే వ్యక్తి కేసీఆర్ కావడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.  ఇటీవల పార్లమెంటులో తెలంగాణ లోగో వాలా హిందీ కమ్ జోర్ అంటూ..  తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచేలా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా మాట్లాడి‌న తీరును మనం అందరం చూసి‌న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్లృతికి గొప్ప ఆదర్శంగా ఉంటుంది. అటువంటి తెలంగాణ యాస భాషను, తెలంగాణ ప్రాంతం పట్ల అవమానపరిచేలా వ్యంగ్యపు మాటలు నిజంగా బాధాకరం.  అటువంటి వివక్షత, రాజకీయ కక్షను, కుట్రలను చేధించడానికి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ తో కేసీఆర్ మరో ఉద్యమానికి సిద్దమయ్యారు. 


కేసీఆర్ రాజకీయ శక్తికి అనేక రాష్ట్రాల్లోని ఆయా పార్టీల్లో కలవర మొదలైంది. కేసీఆర్ ప్రతీ నిర్ణయంలో భవిష్యత్తుకు మార్గం సుగమం చేసేలా ఉంటుంది. అటువంటి పోరాట పటిమ కలిగిన నేతతో జత కట్టడానికి భారతదేశ వ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ మార్గాలు తెలిసిన .. బలమైన గొంతు.. అది కేసీఆర్ అని తెలిసిపోయింది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన నెల లోపే మాజీ ముఖ్యమంత్రి, ఓ రాష్ట్రం లో పార్టీ అద్యక్షునిగా పని చేసి‌న వ్యక్తులు బీఆర్ఎస్ కు జై కొడుతున్నారంటే.. ఇప్పుడు దేశానికి బలమైన నేత అవసరం. ఆ బలమైన నేత కేసీఆర్ అన్న సంగతిని దేశంలోని అనేకమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసీఆర్ వెంట నడవడానికి ఉత్సాహన్ని చూపుతున్నారు.  కేసీఆర్ ముందు చూపు.. ఈ రోజు తెలంగాణ ను అనేక రంగాల్లో ముందుంచేలా చేసింది. అటువంటి నాయకుని అవసరం ప్రస్తుత పరిస్తితులలో దేశానికి ఎంతో అవసరం. ఆయన అడుగులో దేశం కోసం.. మరో పోరాటంలా కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

సంపత్ గడ్డం, ఎం.ఎ.,ఎం.ఎస్.డబ్ల్యు.
దళిత విద్యార్థి నాయకుడు
కామారెడ్డి జిల్లా
7893303516