అవార్డు గ్రహీతను అభినందించిన కేటీఆర్.....

అవార్డు గ్రహీతను అభినందించిన కేటీఆర్.....

ఆలేరు, ముద్ర : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చేసిన కృషిని గుర్తించి జాతీయస్థాయిలో అవార్డును ఏప్రిల్ 8న న్యూఢిల్లీలో అందుకున్నారు. సోమవారం హైదరాబాదులోని నంది నగర్ లో బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, మాజీ మంత్రి కేటీఆర్ ను ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితతో కలిసి ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.

కేటీఆర్ మహేందర్ రెడ్డిని అభినందిస్తూ రైతులకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత బలోపేతం చేయడం ద్వారా రైతులకు అన్ని వసతులు అన్ని వసతులు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.