దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన కేటీఆర్
ముద్ర, ప్రతినిధి ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల నియోజకవర్గాన్ని దేశంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన కేటీఆర్ కే మా మద్దతు ఉంటుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలోని ముదిరాజ్ సంఘ భవనం లో ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దమ్మల దేవయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఈర్ష , అసూయపడే విధంగా సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర కేటీఆర్ కే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాకముందు ముదిరాజులకు మత్స్య సహకార సంఘాలు లేవని తెలంగాణ వచ్చిన తర్వాత మెజార్టీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ముదిరాజులవేనని తెలిపారు. రాజన్నపేటలో ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పడ్డది అంటే అది కేటీఆర్ కృషి వళ్ళనేనని పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి మత్స్య సంపదన పెంపొందిస్తున్నారని దానివల్ల ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పర్శ హన్మాండ్లు తెలియజేశారు. అంతకుముందు రాజన్నపేట ముదిరాజ్ సంఘం సభ్యులు అందరూ కలిసి మంత్రి కేటీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేసి మద్దతు ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ కు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేసి మద్దతు ఇచ్చిన రాజన్నపేట ముదిరాజులకు పర్శ హన్మాండ్లు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందించారు. రాజన్నపేట ముదిరాజ్ సంఘం సభ్యుల సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు వెల్లడించారు. ఈ సమావేశం లో మండల శాఖ అధ్యక్షుడు దేశ్పాండే ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దమ్మల దేవయ్య, మండల సీనియర్ నాయకులు జెల్ల సత్తయ్య, పెరుమాండ్ల అంజయ్య , సొసైటీ అధ్యక్షులు మస్కారి భూమయ్య, గ్రామ నాయకులు పెద్దమ్మల దేవయ్య, చంద్రయ్య, పెద్దమ్మల మల్లయ్య, మస్కారి దేవరాజు, అరిగే రాజు, రానవేణి గోవర్ధన్, పెద్దమ్మల నరసవ్వ, మస్కారి వజ్రవ్వ గుండ్ల ముత్తవ్వ, తదితరులు పాల్గొన్నారు.