రాహుల్ కు మద్దతు గా కాగడల ప్రదర్శన

రాహుల్ కు మద్దతు గా కాగడల ప్రదర్శన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: నరేంద్రమోదీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కి సంఘీభావం గా ఆసిఫాబాద్ లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన కాగడల ప్రదర్శనలో ఎమ్మెల్సి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్థానికులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్ నుంచి బూరిగూడ వరకు ప్రదర్శన కొనసాగింది. రాహుల్ అండగా ఉంటూ దేశాన్ని రక్షించుకుందామని నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల కాంగ్రేస్ కమిటీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ, విశ్వప్రసాద్, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.