జాతీయ అవార్డు ను మంత్రి జూపల్లికి బహుకరించిన కల్వరాల నరసింహ
ముద్ర. వీపనగండ్ల :- సోమశిల గ్రామానికి స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో జాతీయ అవార్డు పొందిన నాగర్ కర్నూలు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ జాతీయ అవార్డును రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సోమవారం బహుకరించారు. సోమశిల కు జాతీయ అవార్డు రావడం మంత్రి జూపల్లి కృష్ణారావు కృషివల్లే లభించిందని కల్వరాల నరసింహ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి జూపల్లి ఆకాంక్షిస్తూ నరసింహ ను ఆశీర్వదించారు. జీవితంలో మైలు రాయి గా నిలిచిపోయేటటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు కల్పించినందుకు మంత్రి జూపల్లి ఆశీర్వాదం తీసుకొవడం జరిగిందని కల్వరాల నరసింహ సంతోషం వ్యక్తం చేశారు.