కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శం

కంటివెలుగు పథకం దేశానికే ఆదర్శం

ఎంపీటీసీ శంకరశెట్టి కోటేశ్వరరావు....

కోదాడ, ముద్ర:కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శమని ఎంపిటిసి శంకర్ శెట్టి కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కూచిపూడి తండా గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ఎంపీఓ తుమ్మల నాగేశ్వరావు, సర్పంచ్ భూక్యా సైదాతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నేత్ర సంబంధిత వ్యాధి గ్రస్థుల కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాక పథకం కంటివెలుగు పథకం ద్వారా అవసరమైన వారికి ఉచిత కళ్ళద్దాలు, మందులు పంపిణి చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వయసురీత్యా 50 సంవత్సరాలు నిండిన , నేత్ర సమస్యలు వున్నవారు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు...ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణిశివప్రియ, హేమంత్,  సుజాత, ఏఎన్ఎం సంతోషమ్మ, ఆశావర్కర్స్ అన్నమ్మ, పద్మ, సువార్త, సుశీల, అలివేలు, గ్రామపంచాయతి సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు..