గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ...

గణేష్ నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ...
  • గణేష్ శోభాయాత్ర లో డీజే, బాణాసంచా నిషేధం 
  • కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :  గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్బంగా జరిగే శోభయాత్ర రూట్ లు, నిమజ్జన కేంద్రాలైన మానకొండూరు చెరువు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తుతోపాటు, పోలీసుపరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా గణేష్ శోభాయాత్రలో డీజేల వినియోగంతోపాటు బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు.

అదేవిధంగా నిమజ్జనం కొరకు నిర్వహించే శోభాయాత్రలో పాల్గొనే భక్తులు ఎటువంటి ఆయుధాల ప్రదర్శన, ఇతరులను గాయపరిచే వస్తువులు కలిగివుండరాదని,  విద్వేషపూరిత నినాదాలు, ప్రసంగాలు చేయడం లేదా పాటల వినియోగం వంటి చర్యలకు పాల్పడరాదని తెలిపారు. ఇట్టి నియమాలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజలంతా భక్తి శ్రద్దలతో, మతసామారస్యాన్ని కాపాడుతూ ప్రశాంత వాతావరణంలో నిమ్మజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించారు.