జమ్మికుంటలో సందడి చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి చాయ్ వాలాగా మారిన కౌశిక్ రెడ్డి

జమ్మికుంటలో సందడి చేసిన బిఆర్ఎస్ అభ్యర్థి చాయ్ వాలాగా మారిన కౌశిక్ రెడ్డి

ముద్ర, జమ్మికుంట:  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి వారి కౌశిక్ రెడ్డి సోమవారం జమ్మికుంట మున్సిపాలిటీలో చాయ్ వాలుగా మారి సందడి చేశారు. అంబేద్కర్ చౌరస్తా లో ప్రసంగం ముగించుకున్న అనంతరం కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఒక హోటల్ కి వెళ్లి స్వయంగా ఆయనే కస్టమర్లకు తేనీరు పోశారు.

అలాగే బ్రిడ్జి కింద ఉన్న చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించారు. అలాగే మరో టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లి దోశ కూడా వేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్మికుంటలో ప్రతి ఓటర్ను కలిసి తమ సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్య పరిష్కరిస్తూ ఓటు అడగాలని అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడు లా పనిచేసే ఈసారి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజారిటీ తీసుకురావాలన్నారు.