26న వనపర్తికి కేసీఆర్ రాక

26న వనపర్తికి కేసీఆర్ రాక

వనపర్తి, ముద్ర: ఈ నెల 26న వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మధ్యాహ్నం 1 గంటకు నిర్వహించనున్న శాసనసభ ఎన్నికల ప్రచారసభకు రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ హాజరుకానున్నారు. కావున పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అన్ని స్థాయిల నేతలు, కార్యకర్తలు హాజరై, విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం కావాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.